పోరాటం చేద్దామా?

అసలు ఎప్పుడైనా మీకు "ఏంటిరా ఎదవ జీవితం" అని అనిపించిందా? అనిపించే ఉంటుంది లెండి నేను మరి అడుగుతున్నాను( అంటే ఆలా అనిపించని వాళ్ళు కూడా ఉండొచ్చు . వాళ్ళకి నా ప్రశంసలు ). అలా అనిపించినప్పుడు మీరు ఎం చేసారండి? చి బ్రతికి వేస్ట్ అని అనుకోని రాత్రి దుప్పటి కప్పుకొని పడుకొని పొద్దునే లేచి మల్లి యెడతద కాదా. ఈమధ్య పుణేలో ఒక సాఫ్ట్వేరు ఇంజనీర్ అండి. పట్టుమని 25 ఏళ్ళు కూడా సరిగ్గా లేవు. ఐటీ కంపెనీలలో ఉద్యోగాలు తేసేస్తున్నారని తన ఉధ్యోగానికి కుడా భద్రత లేదని ఆత్మహత్య చేస్కున్నాడంట.

అసలు సమాజంలో ఎం జరుగుతోంది? అసలు మన దేశంలో నాకు తెలిసి అత్యధిక సంఖ్యలో ఐటీ వాళ్లే ఉన్నారు. డబ్బులు బాగా వస్తాయనే, లెకపొతే అందులోనే ఉద్యోగాలు ఉండడంవల్లనో అందరు అందులోకి వెళ్తున్నారు. అలా అంతమంది ప్రజలు అందులో ఉన్నప్పుడు , అంతమంది కుటుంబాలు దానిమీదే ఆధారపడి ఉన్నప్పుడు ఎంత భద్రత ఇవ్వాలి వాళ్ళకి. లేబర్ ఆఫీసుకు వెళ్లి చెప్పినా వాళ్ళు పట్టించుకోకపోవడం ఏంటి. .సీ రూములలో ఉంటారు కాబట్టి వాళ్ళ కష్టం కష్టంకాదు అనుకున్నారు కాబోలు.


పెద్ద పెద్ద కంపెనీల ఓనర్లు బ్యాంకులలో కోట్లు నిప్పుకోటానికి మనం శ్రమిస్తుంటే వాళ్ళు మాత్రం ఎక్కడ వాళ్ళ బ్యాంకులలో కోట్లు తాగుతాయా అని మన పొట్ట కొడుతున్నారు. ఎంత అన్యాయం ఇది. ఇయినా ఈమధ్య కాలంలో మనం ఎప్పుడు ఒంటరి వాళ్ళం అని అనుకోని బ్రతికేస్తున్నాం. కానీ అందరం కలిసి అందరితో బ్రతుకుతున్నాం అని మర్చిపోయాం. ఆనందంలో పార్టీలకి పిలుస్తున్నారు కానీ బాధని మాత్రం దాచేస్కుంటున్నారు. అరె, మనిషన్నాకా అన్ని ఉంటాయి చెప్పకపోతే లేవని కాదు కదా, చెప్పటానికి ఆలోచిస్తున్నారని. ఇయినా దాచితేయ్ ఏమొస్తది బాధకాకపోతే. సంతోషమో, బాధనో చెప్పండి అప్పుడే కదా మనము ఎదిగేది.

అసలు
ఇలా జరిగి ఉండకూడదు కానీ జరిగిపోయింది. ఇలాంటివి ఇంకా జరగకూడదని ఆశిస్తున్నాం మనమంతా. కానీ ఆశించినవి అన్ని అలా ఐపోతే బాగుండు కానీ కావు కదా. అసలు ప్రాణాలు తీసుకుంటే ఏమొస్తదండి, మా అంటే మన ఒక్కరి బాధ ఆరోజుకి తీరుతడేమో. మనం అంతా కృషిచేస్తేనే కదా మనకు స్వతంత్రం వచ్చింది. ఇప్పుడు కూడా అందరం కలిసి ఏకమై పోరాడితే అందరికి బాధతీరుతది. పోరాడదామా మరి ?

Comments

Popular posts from this blog

10 things one should never miss!!

జీవితం అంటే ?????

Grandparents!