పోరాటం చేద్దామా?
అసలు ఎప్పుడైనా మీకు " ఏంటిరా ఈ ఎదవ జీవితం " అని అనిపించిందా ? అనిపించే ఉంటుంది లెండి నేను మరి అడుగుతున్నాను ( అంటే ఆలా అనిపించని వాళ్ళు కూడా ఉండొచ్చు . వాళ్ళకి నా ప్రశంసలు ). అలా అనిపించినప్పుడు మీరు ఎం చేసారండి ? చి బ్రతికి వేస్ట్ అని అనుకోని రాత్రి దుప్పటి కప్పుకొని పడుకొని పొద్దునే లేచి మల్లి యెడతద కాదా . ఈమధ్య పుణేలో ఒక సాఫ్ట్వేరు ఇంజనీర్ అండి . పట్టుమని 25 ఏళ్ళు కూడా సరిగ్గా లేవు . ఐటీ కంపెనీలలో ఉద్యోగాలు తేసేస్తున్నారని తన ఉధ్యోగానికి కుడా భద్రత లేదని ఆత్మహత్య చేస్కున్నాడంట . అసలు ఈ సమాజంలో ఎం జరుగుతోంది ? అసలు మన దేశంలో నాకు తెలిసి అత్యధిక సంఖ్యలో ఐటీ వాళ్లే ఉన్నారు . డబ్బులు బాగా వస్తాయనే , లెకపొతే అందులోనే ఉద్యోగాలు ఉండడంవల్లనో అందరు అందులోకి వెళ్తున్నారు . అలా అంతమంది ప్రజలు అందులో ఉన్నప్పుడు , అంతమంది కుటుంబాలు దానిమీదే ఆధారపడి ఉన్నప్పుడు ఎంత భద్రత ఇవ్వాలి వాళ్ళకి . లేబర్ ఆఫీసుకు వెళ్లి చెప్పినా వాళ్ళు పట్టించుకోకపోవడం ఏంటి . ఏ . సీ రూములలో ఉంటారు కాబట్టి వాళ్...